ప్రాస ప్రాణమై పల్లవించే -
పదాలని పలికించే స్వరం
నావరమైనదీ ,
మనసులోనూ మేధలోనూ
కవిత్వం అంతర్లీనమైనదీ
నీ ప్రేమతోనే కాబోలు .
అవును నీవే కవితవి ?
ప్రబంధ బందానివా
నాపై దయ వర్షించు .
చందో చర్చిత పద్యానివా ?
కాదు అది మరీ కష్టమూ ,కృతకమూను
నీవో
మధుర లావణ్య
ఉల్లాస శోకతప్త గీతానివి .
పల్లె పాటవి .
అప్పుడప్పుడు కన్నీళ్ళతో ,
ఒక్కోసారి చిరునవ్వులతో
మరోసారి
ఆనందాశ్రు మిళితానుభూతి తో
ప్రకృతి పాడే పాటవి ...
No comments:
Post a Comment