ఉదయం కోరే గగనం
ఎపుడూ సాయంత్రం వద్దనదే
రేయినసలు వద్దనదే
గమ్యం చేర్చే గమనం ఏదీ
చదువొకటే హద్దనదే
ఆటలసలు వద్దనదే !!
కూలి బాలలకి సైతం
సాయంత్రం ఆట విడుపుగా
ఆనందం కాస్త వుందిగా
స్కూలు పిల్లలకి పాపం
ఆ టైమూ జైలు పిలుపుగా
ట్యూషన్ల సైరనుందిగా
హోంవర్కుల ఖైదు అది కదా !
కాలం వేగం కాళ్ళకి రాదే
ఆటలాడకుంటే యిపుడూ
సత్తాగా బ్రతికే సత్తువ
తేలేదే చదువొకటే ఎపుడూ ...
భయమేస్తోందమ్మా
బడి చదువులంటె మాకు ..
wonderful sir !
ReplyDeletethank u sir
ReplyDeleteబాగా రాసారు సర్!
ReplyDeleteఆటలు వేరు చదువు వేరు అనుకునే మన మనస్తత్వాన్ని మాటలలో బాగా రాబట్టారు.
pl see my http://karlapalemhanumantharao.blogspot.com
naa WAVES లో నేను ఇదే విషయం మీద ఒక వీడియో క్లిప్పింగ్ చేశాను .చూసి మీ అభిప్రాయంచెప్పండి!
thanks sir and your blog and the video clipping in waves are excellent . warm regards .
ReplyDelete