అమ్మా నాన్నా అక్కా అన్నా ఉపాధ్యాయులారా
ఈ అల్లి బిల్లీ కబురులలో మా మొరలను వినలేరా !
మా బాల్యం గాలిపటానికి మీ ఆశల సంకెలలేలా?
మా ఊహల రంగుల దారం కొస ఇదిగో అందుకొలేరా !
చ ౧ :భవితంటే బడి చదువొకటే అనుకొంటూ మీరుమ్టే
మీకోసమ్ మేం మిమ్మల్నే ప్రతిరోజూ మిస్సవుతుమ్టే
మూడు మల్లెలెత్తు సుకుమారులము
ఎన్ని యాతనలు మోసెదము ? //౨సార్లు//
చ : చందమామ కధలే చెబుతూ తాతయ్యే జో కొడుతుంటే
ఊ కొడుతూ నిదురోతాము హాయిగా తీయగా
home work భూతమల్లే కలలోనూ భయ పెడుతుంటే
ఉలిక్కిపడి లేస్తుంటాము బేలగా బేజారుగా ..
ఏమి చెప్పమమ్మా మా యాతనలెన్నంటే ..
.
.గెలుపంటే మార్కుల వరుసన మొదటి పేరు అనుకుంటే
అరిస్టాటిలూ ఐనిస్టియనూ కుడా ఓడినట్లే
టెమ్డూల్కరూ రామానుజన్ ఎన్నడూ గెలవనట్టే
గెలుపంటే ఒక ఆనందం గెలుపంటే ఒక అభిమానం
చెరగని సిరి చిరునవ్వులకి చిరునామా అవడం గెలుపంటే
..ఆ దారిని బ్రతుకున చూపే సిరిదీపం ఈ చదువంటే ...
-మన్ను తడి తాకద్దంటే మాను గా ఎదిగేదేలా ?
ఆకాశం చూడొద్దoటే ఆ ఎత్తుకు ఎగిరేదేలా ?
మట్టి తో చుట్టరికాన్నీ మబ్బుతో మా స్నేహాన్నీ
దూర౦ చేసి దగ్గర కొచ్చే tuition fashion దేనికనీ
గెలుపులో ఆన౦దాన్నీ ఓడినా sportiveness నీ
మా దరి చేర్చే ఆటల 'సాయం' దూరమయీ !!
బాల్యం లో ఆట పాటలు భవితకి బంగారు బాటలు
మా బాల్యం మాకివ్వండి
ఆనందంగా చదివేస్తాం మా సత్తా చూపిస్తాo
ప్రియ భారతి ముద్దు బిడ్డలై దేశానికి పనికొస్తాం
Reminds me of my childhood .
ReplyDeleteCrying in wilderness.
Awesome