Friday, October 26, 2012

బలి అవుతున్నది బాల్యమా ?





అమ్మ కొంగు చేజుట్టుకుని
నాన్న వేలికొన పట్టుకుని
పయ్నించే ఆ పసిడి పసితనం
ఎంతమంది సొంతం ? అయ్యో విధికి ఎంత పంతం ?

వెన్నెల చలికే వణికే చేతులు
వేడి చాయ్ లందిస్తుంటే
పలకా బలపం పట్టే ప్రాయం
పనిలో యాతన పడుతుంటే
బలి అవుతున్నది బాల్యమా ?
దేశ ప్రగతి భవితవ్యమా ?

మట్టి ఒడిలోన మమత పంచుకొను
గుజ్జనగూళ్ళను కట్టుకుని
మబ్బుతునకపై మమత పెంచుకుని
గాలిపడగలెగరేసుకుని
మన్నునుండి ఆ మిన్ను వరకు
ఈ విశ్వమంత మాదే అనే
అందమైన ఆనందమైన అపురూపమైన బాల్యం
ఎంతమమంది స్వంతం అయ్యో విధికి ఎంత పంతం ?

1 comment:

  1. బాగా రాశారండి, మీ బ్లాగ్ పేరు, ఆశ్రీ అని వస్తుందండి హారంలో....వర్డవెరిఫికేషన్ తొలగించండి..

    ReplyDelete