పల్లవి :
దేశం మనదేశం మనదేశం భరత దేశం
దేశం మనదేశం మనదేశం భరత దేశం
మన ప్రాణమైనదీదేశం జన ప్రణవమైనదీ దేశం
మన ప్రాణమైనదీదేశం జన ప్రణవమైనదీ దేశం
మరు జన్మ మనకుంటె ఈ మట్టి ఒడిలోన
పలు జన్మలెత్తాలి రా ...
దేశం మనదేశం మనదేశం భరత దేశం
దేశం మనదేశం మనదేశం భరత దేశం
చరణం :
వేద స్మృతికి జన్మను యిచ్చిన దివ్య ధాత్రి ఈ దేశం
వేల సిరులు జగతికి పంచిన ధన్య ధాత్రి మన దేశం
వేద స్మృతికి జన్మను యిచ్చిన దివ్య ధాత్రి ఈ దేశం
వేల సిరులు జగతికి పంచిన ధన్య ధాత్రి మన దేశం
మంచు నగం మంచి తనమై గగన తలం తాకే దేశం
మంచు నగం మంచి తనమై గగన తలం తాకే దేశం
త్రిమూర్తి స్వరూపం లా సాగరాలు సాకే దేశం
చరణం :
జనగణమన స్వరముల శృతిలో జనముల పాలించే దేశం
మువ్వన్నెల పతాక దృతిలో ముజ్జగాలనేలే దేశం
జనగణమన స్వరముల శృతిలో జనముల పాలించే దేశం
మువ్వన్నెల పతాక దృతిలో ముజ్జగాలనేలే దేశం
మానవ విలువల పరిరక్షణనే శ్వాసించే ఘన రాజ్యాంగం
దుష్టుల పాలిట జ్వాలానేత్రమె దేశపు న్యాయం చట్టం . . .
స్వర కల్పన : కిరణ్ కుమార్
No comments:
Post a Comment