భయమంటే నాకు చాలా భయం ! అందుకే ఎప్పుడూ దగ్గరకి రానివ్వ లేదు . నిప్పు , నీరు , నింగి , నేల , మనుషులు , జంతువులు , ఆకలి , అప్పులు , ఏవీ నన్ను భయ పెట్ట లేక పోయాయి . కాక పొతే ఒక్కో అనుభవం ఒక్కో పాఠాన్ని నేర్పాయంతే . ఎలా ఉండాలో కొన్ని , ఎలా వుండ కూడదో కొన్ని .
చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేటప్పుడు , కోతి కొమ్మచ్చి లాటలలో చెట్లేక్కేటప్పుడు , వేసవి మధ్యాహ్నాలు మామిడి తోటలలో కాయలు కోసుకుని తోట మాలి అరుస్తుంటే పక్కనే వున్న ఏట్లోకి దూకేసి నప్పుడు , చినచిన్న దెబ్బలు తగిలినా ఎప్పుడూ భయపడలేదు. స్నానాలు చేసి తడి బట్లతో ఇల్లు చేరి నానమ్మ చేత మిత్రులంతా మూకుమ్మడిగా తిట్లు తిని వాటితో బాటు తాయిలాలూ తినేసి తిరిగి ఆటకి తయారు .
ఆట లక్ష్యం గెలుపో ఓటమో కాదు కేవలం ఆడడం అంతే. .
జీవిత పరమార్థం కూడా కేవలం జీవించడం , జీవితాన్ని యధాతధం గా ఆశ్వాదించడం అంతే కన్నీరు , చిరునవ్వూ , కస్టాలూ , సుఖాలూ , సౌఖ్యాలూ , గెలుపులూ ,ఓటమిలూ ...యివన్నీ ప్రతీ జీవితానికీ అంతర్లీన స్రవంతి గా ఎదురయ్యేవి . ఈ జీవన సత్యాన్నే మా తరానికి బాల్యం ఆటలయినా , బామ్మలయినా నేర్పినది . స్కూల్ లో చదువుకునే రోజులలో లెక్కలంటే బోలెడు భయ పడాలన్నారు , ఎక్కాలని వల్లే వేయించాడు తాతయ్య , ` జ్ఞాపకమే జ్ఞానం ' అన్న సోక్రటిస్ తెలియని తాతయ్య , వేదాలు , వ్యవసాయం మాత్రమే తెలిసిన తాతయ్య . అంతే లెక్కలంటే బొత్తిగా లెక్కలేకుండా పోయింది . ఇంగ్లీష్ అంటే భూతమనే భ్రమ కొన్నాళ్ళు , రోజూ ఓ పదం నేర్చుకుందాం అన్నాడో మిత్రుడు . తిరుగులేని తాయత్తు . దెబ్బకి దెయ్యం వదిలింది .
ఈ తరం పిల్లలకి ఆనాటి బాల్యపు ఆటలు లేవు , వీడియో గేములే . ఒడిలో కూర్చోపెట్టుకుని మంచి , చెడ్డా చెప్పే బామ్మలూ , తాతయ్యలు లేరు , వుంటే వృద్దాశ్రమం లోనో , కాకుంటే వేరే ఊర్లలొనొ , వేరే ఇళ్ళలోనో ...
For every problem there is a solution , if there is one find it , if there is none never mind it ! its not at all a problem then అని ధైర్యం చెప్ప గలిగే మిత్రులూ చాలా మందికి లేరు .. ఫలితం ఒక్క మార్క్ తగ్గి నాలుగు ర్యాంకులు వెనక పడితే అమ్మ తిడుతుంధనో , నాన్న కొడతాడనో , స్కూల్ లో తాట తీస్తారనో ...టెన్షన్ , భయం ... ట్యూషన్లు , హాస్టల్స్ ..
.ఆ మధ్య హైదరాబాద్ లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో ఓ ప్రిన్సిపాల్ నిర్వాకం నుంచి , ఇటీవల ఎలమంచిలి లో ఓ ట్యుటోరియల్ సెంటర్ నిర్వాహకుడి అఘాయిత్యం వరకూ ( అవి ఏమిటో వివరించి నా కీ బోర్డ్ కి అశ్లీలపు రాతల అపవిత్రతని అంటగట్ట లేను నేను )
యింక కలల కొత్త లోకాలని ఆవిష్కరించే కళాశాలలు , విశ్వవిద్యాలయాలు , ఉద్యోగ ప్రదేశాల లో మాత్రం మేమేం తక్కువ తిన్నాం అంటూ ... ప్రేమ పేరిట ఎమోషనల్ బెదిరింపులూ , ఆత్మ హత్యలూ ,ఏసిడ్ దాడులూ ,...హత్యాయత్నాలూ, హత్యలూ ...
సంసారాల సాగరాల అలల కల్లోలాలలో ఒక్క మునక వేసామనుకోండి ....పూటు గా తాగొచ్చి ,
వరం డాలో నిద్ర పోతున్న కట్టుకున్నావిడని లేపి లోనికి రమ్మని ఆఖరి అనుభవాన్నీ అనుమానం తో జీవితపు ఆఖరి క్షణాలనీ అందించ గలిగిన , అడ్డొచ్చిన ఆవిడ తరపు బంధువులని సైతం అక్కడికి అక్కడే నరికి వేయగలిగిన ఉత్తమోత్తముడయిన భర్త , అన్నం లో కి కూర వండి పెట్ట లేదని తల్లిని కడ తేర్చిన పుత్ర రత్నం , తనకు భారంగా మారిందని.. కన్నతల్లిని కర్కసం గా బతికుండగానే సజీవదహనం చేసి శవాన్ని సమీపంలోని పాడుబడ్డ బావిలో పడేసిన మాననీయ మహిళా మాణిక్యం , అయిదవ తరగతి చదువుతున్న చిన్న కూతురిని .....( జుగుప్స తో వేళ్ళు వణుకుతున్నాయి ఈ సంఘటన వ్రాయడానికి ) న కామం తో కళ్ళు మూసుకు పోయిన ఒక దౌర్భాగ్యపు తండ్రి ...
యిలాంటి వెధవల వలన ... నిత్యం జరుగుతున్న దిక్కుమాలిన సంఘటనలని చానల్స్ లో చూస్తున్నా, పేపర్లలో చదువుతున్నా ... భయానికి నేనంటే భయం తగ్గుతోంది .
యివన్నీ ఒక ఎత్తు , సిద్దాంత పరమైన ( ! ? ) హత్యలు , తీవ్రవాదమ్ , రాజకీయాలు వీటి జోలికొస్తే ... వివరించేందుకు , ఈ కాలమ్ , నా కాలం రెండూ సరిపోవు , తిలక్ మాటల్లో చెప్పాలంటే ` గాంధీ గారి దేశం లో గజానికో గాంధారి కొడుకు ' భయమేస్తోందా ?
పాతిక సంవత్సరాల క్రితం అనుకుంటా ఆంగ్ల పద సంపద పెంచుకునే యత్నంలో ఓ కొత్త పదాన్ని ఉపయోగింఛి ఒక్కొరూ ఒక్కో వాక్యం చెప్పాలి అదీ ఆట ఓ మిత్రుడు చెప్పాడు ` satya sai baba is the incarnation of swami vivekananda ' అని ఆ వాక్యపు నిజానిజాల గురించి ఎప్పుడూ ఆలోచిం చ లేదు , అనవసరం అని . కానీ వివేకానందుడి పుస్తకాలు చదవడం మొదలు పెట్టాం , మంచి english నేర్చుకోవడం కోసం . హిందూ ధర్మ శాస్త్రాల లోని మానవీయ విలువలని ప్రపంచానికి చాటడం గా ఆ పుస్తకాల సారం అప్పటికి మాకు అర్థమయింది .
సరే మరి బాబా గారి సంగతేమిటి ?
సుమారు 160 కి పైగా దేశాల నుంచి అరవై లక్షలకు పైగా భక్తులని పోనీ అనుయాయులని సంపాదించి ,వారి నుంచి లక్షల కాకుంటే వేల కోట్ల రూపాయలని సమీకరించి విద్య , వైద్యం ( ప్రస్తుతం ప్రపంచదేశాల్లో ఎక్కడయినా అత్యంత ఖరీదయినవి ఈ రెండూను ) సుమారు 1500 గ్రామాలకి తాగు నీరు సాగు నీరు అందించ గలిగిన మహనీయుడు మరణ శయ్య పై చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నప్పుడు "సత్యసాయి దేవుడయితే వీల్ చైర్ లో ఎందుకు కూర్చుంటాడు సార్?" అని ప్రశ్నించిన ఏంకర్లున్న చానల్స్ చూడడమ్ ఒక ఖర్మ అయితే , ఆ ప్రశ్న కి సమాధానం యివ్వగలిగే అవకాశము , తీరికా లేక పోవడం ఒక అదృష్టం .
ఆయన మరణానికి కొన్ని వారాల క్రితమే మృత్యు మంజూష ( శవ పేటిక ) ని సైతం సిద్దం చేయించ గలిగిన మహా దార్శనికత కలిగిన మేధావుల చేతులలో వితరణ శీలులయిన అరవై లక్షల పైగా భక్తుల శ్రమ ఫలితం నిజంగా యిటు పైన నిజమయిన సేవలో సంపూర్ణం గా త్రికరణ శుద్ధి గా వినియోగించబడుతుందా ? అని ఇప్పుడు నాకు కొత్తగా పట్టుకున్న భయం.అవును.....
భయానికి బొత్తిగా నేనంటే భయం పోయింది ఈ మధ్య ఎప్పుడూ నాతోనే వుం టోంది.
No comments:
Post a Comment