సందర్భం : గెలుపుకోసమో గుర్తింపుకోసమో ఉనికిని నిలుపుకోవడానికో ఉన్నతిని చేరుకోవడానికో ...
కారణాలేమయినా ...కాలంతో పరుగులు తీస్తూ పెర్సనల్ లైఫ్ లో అయిన వాళ్ళని మిస్ అవుతున్న అతడు ...
...గమ్యం చేరినా పయనం తప్పదనీ ` మరి మనకంటు మిగలాలి మనవయిన క్షణములు ' అనే భావనలో ఆమె . ఇదీ సంధర్భం .
కొంచం అటూ ఇటూ గా భార్యాభర్తల మధ్యా , తల్లిదండ్రులు పిల్లల మధ్యా ఆఖరికి స్నేహితుల మధ్య సైతం ఇలాంటి సంధర్భాలు అసందర్భం కాదు .
ఒరిజినల్ సాంగ్ : క్రిమినల్ సినిమాలో ` తెలుసా మనసా ... '
ఆమె : ఆహా ఆహా ఆహా ఆ ఆ ఆ ...
అతడు : కదిలే నదిలా యిల సాగేటి ఈ జీవితం
కరిగే అలలా మన ప్రేమాయె ఒక జ్ఞాపకం
తనలో ఎన్ని అలజడులు ఎన్ని అందాలు దాచుకున్న గమనం
తనకై కొన్ని మధనాలు కొన్ని మధురిమలు స్వంతమైన పయనం
యిది కన్నీటి పన్నీటి సంగమ శృతి గతి ... ||కదిలే ||
చరణం : అతడు ప్రతి కలా ... పరవళ్ళలొ అలలుగా పొంగనీ
గెలుపుకై ...అడుగడుగున పరుగులె తీయనీ
ఉరకలే ఊపిరై , గెలుపులే మలుపులై
తన గమ్యాన్ని చేరేటి సాధనల శోధనలొ ||కదిలే|
ఆమె : ఆహా ఆహా ఆ ఆ ఆ ఆ .....
అతడు : darling !
dreams die first
but the eyes not yet
little the time I have
noway but to move
to win allover for ever and ever ...
.ఆమె : సంద్రమే ...చేరగానె ఆగదే ఏ నదీ
ఆవిరై ...నింగి చేరి వాన కాదా అదీ
గమ్యమే చేరినా గమనమే ఆగునా
మరి మనకంటు మిగలాలి మనవయిన క్షణములు
కదిలే నదిలా యిల సాగేటి ఈ జీవితం
అతడు: కరిగే అలలా మన ప్రేమాయె ఒక జ్ఞాపకం
ఆమె : తనలో ఎన్ని అందాలు ఎన్ని అలజడులు దాచుకున్న హృదయం
అతడు : తనకై కొన్ని మధనాలు కొన్ని మధురిమలు స్వంతమయిన పయనం
ఇద్దరు : యిది కన్నీటి పన్నీటి సంగమ శృతి గతి ...
ఆమె : కదిలే
అతడు : నదిలా
ఇద్దరు: యిల సాగేటి ఈ జీవితం
అహా ఆహా ఆహా ...ఆ ...
శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి శ్రీ కీరవాణి గారికి క్షమాపణలు ,
కృతజ్ఞతలు
ఆశీర్వాదాభిలాషి
శ్రీకృతి గారు!
ReplyDeleteసందేహం లేదు. మీరు అద్భుతమైన గేయ కవి.
అభినందనలు!
ధన్యోశ్మి
Delete